Ad Code

ఆండ్రాయిడ్ ఫోన్లపై 'డామ్’ వైరస్


ఆండ్రాయిడ్ ఫోన్‌లకు హాని కలిగించే ‘డామ్’ అనే మాల్వేర్‌కు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ మార్వెట్ మీ ఫోన్లలోని కాల్ రికార్డ్‌లు, కాంటాక్ట్‌లు, బ్రౌజింగ్ హిస్టరీ, కెమెరా వంటి వాటిని యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. 'డామ్' పేరుతో ఉన్న వైరస్ యాంటీ వైరస్ ప్రోగ్రాములను కూడా ఏమార్చగలదని, దీనిని గుర్తించడం, తీసేయడం కష్టతరం అని తెలిపింది. ఈ వైరస్ మీ మొబైల్ ఫోన్ ను లాక్ చేసి, దాన్ని అన్ లాక్ చేయడానికి డబ్బులను కూడా డిమాండ్ చేసే హానికరమైన సాఫ్ట్ వేర్ ransomwareని కూడా అమలు చేస్తుందని తెలిపింది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ని అన్ ట్రస్ట్‌డ్, అన్ నోన్ సోర్స్ నుంచి డౌన్ లోడ్ చేస్తే ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఒకసారి డామ్ వైరస్ ఫోన్లలోకి ఎంటరైతే, అది ఫోన్ భద్రతా వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఫోన్ కాల్ రికార్డింగ్స్, కాంటాక్స్ హ్యాక్ చేస్తుంది. కెమెరాను యాక్సెస్ చేయగలదని హెచ్చిరిస్తున్నారు నిపుణులు. మొబైల్స్ లోని ఫైల్స్ ను ఎన్‌క్రిప్ట్ చేయడానికి మాల్వేర్ AES అనే అధునాతన ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌ని ఉపయోగిస్తుంది. ఇది డివైజ్ లో ఉండే ఫైల్స్ ను తొలగించిడానికి, ఎన్ క్రిప్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఒక్కోసారి పర్సనల్ డేటాను దొంగిలించి డబ్బులను కూడా డిమాండ్ చేసే ర్యామ్సన్ వేర్ గా మారొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పడకూడదంటే  అన్ ట్రస్టెడ్ వెబ్ సైట్లను, అన్ నోన్ లింక్స్ పై క్లిక్ చేయడం చేయొద్దని కేంద్రం తెలిపింది. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయడం మంచిది. అనుమానాస్పద ఫోన్ నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ‘bitly’ లేదా ‘tinyurl’ హైపర్‌లింక్‌లను కలిగి ఉన్నటువంటి సంక్షిప్త URLలతో వ్యవహరించేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ URLలు హానికరమైన వెబ్‌సైట్‌లకు దారి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

Post a Comment

0 Comments

Close Menu