Ad Code

డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ డెవలపర్


హెచ్‌సీఎల్ ఇటీవల లేఆఫ్స్ ప్రకటించింది. దీంతో కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ రాపోలు అనే ఉద్యోగి, లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో మరో ఐటీ కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అప్పటి వరకు ఖాళీగా ఉండటం ఇష్టం లేక బైక్ ట్యాక్సీ ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒక రైడ్‌లో శ్రీనివాస్‌కు లవ్‌నీష్ ధీర్‌ అనే టెక్కీ కలిశాడు. ఆ సమయంలో తన జీవిత కథను ఇంజనీర్ కమ్ డ్రైవర్ చెప్పాడు. ఈ విషయాన్ని లవ్ నీష్ ట్విట్టర్‌లో పంచుకోవడంతో శ్రీనివాస్ కథ బయటి ప్రపంచానికి తెలిసింది. 'ఈ ర్యాపిడో వ్యక్తి జావా డెవలపర్‌గా పనిచేశాడు. ఇటీవల హెచ్‌సీఎల్ లేఆఫ్స్‌కు గురయ్యాడు. ఇతను జావా డెవలపర్ ఓపెనింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆసక్తి ఉన్న వ్యక్తులు శ్రీనివాస్ CVని అడగవచ్చు. ఏదైనా ఉద్యోగం ఉంటే అతనికి మెసేజ్ చేయవచ్చు. నా దగ్గర అతని CV ఉంది. సంబంధిత ఓపెనింగ్స్ గురించి తెలిసి ఉంటే వెంటనే నన్ను డైరెక్ట్ మీట్ అవ్వవచ్చు.' అంటూ లవ్‌నీష్ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనను అతడు "పీక్ బెంగళూరు"గా అభివర్ణించాడు. లవ్‌నీష్ ధీర్ పోస్ట్ చేసిన ట్వీట్‌కు 1 లక్షకు పైగా వ్యూస్, వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు ఉద్యోగ అన్వేషణలో సహాయం చేస్తున్నందుకు ధీర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఉద్యోగ అవకాశాలను పంచుకున్నారు. ఇంకొందరు దీన్ని ప్రచారం కోసం చేసే జిమ్మిక్కుగా పేర్కొన్నారు. దీంతో ధీర్ మరోసారి స్పందించారు. 'ఈ ట్వీట్ జిమ్మిక్ కాదు' అంటూ ట్వీట్ చేస్తూ శ్రీనివాస్ CV లింక్‌ షేర్ చేశారు. సీవీవి చూస్తే ఉద్యోగం కోల్పోయిన ఇంజనీర్ రాపోలు 2020 సెప్టెంబర్‌లో HCLలో పని చేయడం ప్రారంభించాడు. దాదాపు మూడేళ్ల తరువాత అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.

Post a Comment

0 Comments

Close Menu