మధ్యప్రదేశ్ కు సంబందించిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్ చార్జింగ్ అవడంతో పాటు సింగిల్ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. యాంబియర్ ఎన్8 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎనిగ్మా ప్రకారం ఈ స్కూటర్ 200 కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంది. అదనంగా, స్కూటర్ 26-లీటర్ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.. ఇది కంపెనీ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది.. ఈ ప్రత్యేక యాంబియర్ ఎన్8 ధర మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రారంభ ధర రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎన్8 థండర్‌స్టార్మ్ ఐదు రంగులలో లభిస్తుంది - గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్, సిల్వర్ కలర్లో లభిస్తున్నాయి.. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ పై 200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని, దీంతో కొద్ది దూరాలకే చార్జింగ్ సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.. మార్కెట్ లోకి వచ్చిన వెంటనే వీటికి డిమాండ్ కూడా పెరిగింది. https://t.me/offerbazaramzon
0 Comments