Ad Code

చాట్​జీపీటీ వింటుంది, మాట్లాడుతుంది, చూస్తుంది !


చాట్​జీపీటీ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా వాయిస్ ని ఉపయోగించి AI-ఆధారిత చాట్బాట్ తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా సాయాన్ని పొందడానికి వినియోగదారులను అనుమతించే మరొక ఫీచర్ ని కూడా యాడ్ చేసింది. త్వరలోనే సరికొత్త వాయిస్, ఇమేజ్ సామర్థ్యాన్ని AI చాట్ బాట్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ వాయిస్ ని ఉపయోగించి ప్రశ్నలు అడగడంతో పాటు కావాల్సిన సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మొబైల్స్ లో చాట్​జీపీటీ వినియోగదారులు ఇకపై చాట్ బాట్ తో సంభాషించే అవకాశం ఉంది. అంటే వినియోగదారులు చాట్ బాట్ ను ప్రశ్నలను అడగవచ్చు. అప్పటికప్పుడు సమాధానాలు పొందవచ్చు. కొత్త ఫీచర్ ను మీ మోబైల్ లో ఈజీగా గుర్తించే అవకాశం ఉంది. ముందుగా మీ మొబైల్లో చాట్​జీపీటీ యాప్ ని ఓపెన్ చేయాలి. యాప్ ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి, ఆ తర్వాత ‘న్యూ ఫీచర్స్’ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘వాయిస్ చాట్’ అనే ఆప్షన్ కనిపిస్తోంది. యూజర్ వాయిస్ ను చాట్ బాట్ టెక్ట్స్ లోకి మార్చుకుని సమాధానాలు ఇస్తుంది. ఈ వాయిస్ ఫీచర్ అచ్చం మనిషి మాదిరిగానే పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫోటోలను చాట్ జీపీటీలోకి అప్ లోడ్ చేయడం ద్వారా పలు ఎప్పటికప్పుడు పలు వివరాలను పొందే అవకాశం ఉందని కంపెని  వెల్లడించింది. భోజన సమయాన్ని గుర్తు చేయడంతో పాటు మీ ఫ్రిజ్ లోని పదార్థాల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించనుంది. చాట్ జీపీటీలోకి ఫ్రిజ్ ఫోటోలు అప్ లోడ్ చేయడం ద్వారా ఈ వివరాలను పొందే అవకాశం ఉందని తెలిపింది. మొబైల్ యాప్ లోని డ్రాయింగ్ టూల్ ను ఉపయోగించి యూజర్లు ఇమేజ్ ను కచ్చితంగా అప్ లోడ్ చేయడం ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాయిస్ చాట్, ఇమేజ్ రికగ్నిషన్ ఫీచర్లు రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. చాట్​జీపీటీ ప్లస్, ఎంటర్ప్రైజ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని OpenAI తెలిపింది. చాట్​జీపీటీ ప్లస్ ధర భారత్ లో నెలకు రూ.1,600గా కంపెనీ నిర్ణయించింది.

Post a Comment

0 Comments

Close Menu