Ad Code

ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్‌ !


ఎక్స్ లో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్లను అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఎలాన్​ మస్క్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. ఈ ఫీచర్ల యాక్టివేషన్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా ఆయన షేర్​ చేశారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను 'ఎవ్రీథింగ్' యాప్​గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్‌ ఫీచర్లను తీసుకురానున్నట్లు ఎలాన్​ మస్క్ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ ఫీచర్‌ సాయంతో ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఎక్స్‌లో కాల్స్‌ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలు ఈ కాలింగ్‌ ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తాయి. కొన్ని రోజుల క్రితం.. ఎక్స్​ యూజర్లకు మస్క్​ షాక్​ ఇచ్చారు. త్వరలోనే ఎక్స్​​ ఖాతాదారులు అందరి నుంచి నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే కనుక అమలు జరిగితే యూజర్లపై అదనపు ఆర్థిక భారం పడడం ఖాయం. సబ్​స్క్రిప్షన్ ఫీజు విధిస్తామని స్పష్టం చేసిన ఎలాన్​ మస్క్​.. అది ఎంత మేరకు ఉంటుందనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి అదనపు ఫీచర్లు కల్పిస్తారా? లేదా? అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. ప్రస్తుతం ఎక్స్ వేదికలో 550 మిలియన్లకు పైగా మంత్లీ యూజర్స్​ ఉన్నారని ఎలాన్ మస్క్ తెలిపారు. వీరు ఒక రోజులో కనీసం 100 నుంచి 200 మిలియన్ల పోస్టులు పెడుతున్నారని ఆయన వివరించారు. ఒక వేళ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ అమలులోకి వస్తే.. ట్విట్టర్​ (ఎక్స్) కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది.

Post a Comment

0 Comments

Close Menu