Ad Code

టయోటా 2025 క్యామ్రీ !


యోటా మోటార్ కార్పొరేషన్ ప్రపంచంలోనే టాప్‌ ఆటోమేకర్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 180కి పైగా దేశాల్లో ప్యాసింజర్ కార్లు, ట్రక్కులు, SUVలు, వ్యాన్‌లు, బస్సులు లాంచ్‌ చేస్తోంది. క్వాలిటీ, పర్ఫార్మెన్స్, పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే టయోటా తాజాగా ప్రపంచవ్యాప్తంగా 2025 క్యామ్రీ వెహికల్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. దీనికి ముందు వచ్చిన అన్ని వేరియంట్‌లు సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. దీంతో న్యూ మోడల్‌ లేటెస్ట్‌ డిజైన్, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, ఇంప్రూవ్డ్‌ పర్ఫార్మెన్స్‌పై అంచనాలు పెరిగాయి. ఇది వచ్చే ఏడాది భారతదేశంలో అందుబాటులోకి రావచ్చు. 2025 క్యామ్రీ TNGA-K ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. రీవ్యాంప్డ్‌ సస్పెన్షన్ సెటప్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తూనే ప్రస్తుత మోడల్‌ నుంచి కొన్నింటిని కొనసాగించింది. ఎక్ట్సీరియర్ డిజైన్, రాబోయే టయోటా ప్రియస్ తరహాలో స్పోర్టి డిజైన్‌గా ఉంది. పెద్ద గ్రిల్, రీడిజైన్డ్ LED హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు వంటి ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. వేరియంట్స్‌లో LE (బేస్ మోడల్), SE, XLE, XSE (టాప్ మోడల్) ఉన్నాయి. ప్రతి ఒక్కటి వివిధ ప్రాధాన్యతలకు అనుగుణంగా విభిన్న ఫీచర్లను అందిస్తాయి. వెనుక లిప్ స్పాయిలర్ వంటి స్పోర్టీ టచ్‌లు, ఎక్స్‌పోజ్డ్ డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్ ఆకట్టుకుంటాయి. రెండు కొత్త కలర్‌ ఆప్షన్లు ఓషన్ జెమ్, హెవీ మెటల్ అందుబాటులోకి వస్తాయి. వైర్‌లెస్ Apple CarPlay/Android ఆటోతో కూడిన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10-అంగుళాల హెడ్స్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉన్న డాష్‌బోర్డ్ కొత్త లుక్‌ అందిస్తుంది. సెడాన్ USB-A, USB-C పోర్ట్‌లతో కనెక్టివిటీ, ఛార్జింగ్ ఆప్షన్లు అందిస్తుంది. ఇంకా 9-స్పీకర్ JBL ప్రీమియం ఆడియో సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ సైడ్ ఎకౌస్టిక్ లామినేటెడ్ గ్లాస్, మెమొరీ ఫంక్షన్‌తో ఆప్షనల్‌ హీటెడ్‌, వెంటిలేటెడ్ సీట్ల, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. న్యూ మోడల్‌లో 2.5-లీటర్, ఫోర్‌-సిలిండర్ ఇంజన్‌తో పాటు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ఫ్రంట్‌ యాక్సెల్‌ వద్ద రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇది 223 bhp కంబైన్డ్‌ పవర్‌ అవుట్‌పుట్‌ ఉత్పత్తి చేస్తుంది. సెడాన్ ఆల్-వీల్-డ్రైవ్, ఫ్రంట్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది, వరుసగా 232 bhp, 225 bhp పవర్ అవుట్‌పుట్‌లు అందిస్తాయి. టయోటా ఎఫిషియన్సీ, ఎన్విరాన్‌మెంటల్‌ సస్టైనబిలిటీ కోసం హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌పై దృష్టి సారించి V6 ఇంజిన్ ఆప్షన్‌ను నిలిపివేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ అండ్‌ రోడ్ సైన్ అసిస్ట్‌ సహా అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ (ADAS) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, రాడార్-బేస్డ్‌ క్రూయిజ్ కంట్రోల్, ప్రీ-కొలూషన్‌ సిస్టమ్‌ విత్‌ పెడెస్ట్రియన్‌ డిటెక్షన్‌, ఆటోమేటిక్ బ్రేకింగ్‌, ఫ్రంట్‌, బ్యాక్‌ పార్కింగ్ అసిస్ట్ ఆప్షన్లతో వస్తుంది. 2025 టయోటా క్యామ్రీ ఇటీవల అప్‌డేట్‌తో వచ్చిన స్కోడా సూపర్బ్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu