Ad Code

29న టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల


టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను డిఫరెంట్ డిజైన్ మరియు 24GB RAM ఫీచర్ తో తీసుకు వస్తున్నట్లు టెక్నో భారీగా టీజింగ్ చేస్తోంది. దీనిని 29న అమెజాన్ స్పెషల్ గా తీసుకువస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 100+ కస్టమ్ సెట్టింగ్స్ కలిగిన 210 Mini LED ని అందించింది. ఈ లైట్ తో ఈఫోన్ చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. స్మార్ట్ ఫోన్లు 12GB ఫిజికల్ రామ్,12GB ఎక్స్ ప్యాండబుల్ RAM తో కలిపి టోటల్ 24GB RAM ఫీచర్ తో తీసుకు వస్తుంది. ఈ ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 10 AMOLED స్క్రీన్ ను 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ తో కలిగి ఉన్నట్లు, 70W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ కలిగి 6000 mAh బ్యాటరీని కలిగిన మొదటి ఫోన్ గా టెక్నో పోవా 6 ప్రో నిలుస్తుందని టెక్నో వివరించింది. ఆకర్షణీయంగా కన్పించేలా చేయడానికి Dynamic Port 2.0 ఫీచర్ కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Hi-Res Audio మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో 108MP + 2MP + AI లెన్స్ ట్రిపుల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu