Ad Code

త్వరలో లావా ఓ2 స్మార్ట్ ఫోన్ విడుదల ?

దేశీయ మార్కెట్లో లావా ఓ2 స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది.  అమెజాన్ లో దీనికి సంబంధించిన లిస్టింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఇందులో రివీల్ అయ్యాయి.గ్రీన్ కలర్ వే ఆప్షన్ తో  ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. కెమెరా మాడ్యూల్లో మార్పులు కూడా చేశారు. వేర్వేరు యాంగిల్స్ లో ఇది ఒక్కోలా కనిపిస్తుంది. కింద భాగంలో ఎడమవైపు చిన్న లావా లోగో ఉంది.  దీని డిజైన్ మ్యాట్ ఫినిష్తో వచ్చింది. యూఎస్బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్ కలిగి ఉంది. అమెజాన్ లో పేర్కొన్న లావా ఓ2 స్పెసిఫికేషన్లను బట్టి ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, ముందువైపు హోల్ పంచ్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా అందించనున్నారు. మొబైల్ వెనకభాగాన్ని ఏజీ గ్లాస్ తో రూపొందించారు. మ్యాజెస్టిక్ పర్పుల్ కలర్వేలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్ పై లావా ఓ2 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 అందించనున్నారు. అంటుటు బెంచ్ మార్క్ టెస్టులో ఈ ఫోన్ 2.5 లక్షల పాయింట్లను సంపాదించింది. ఈ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. లావా ఓ2 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu