Ad Code

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ వినియోగదారులకు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం హెచ్చరిక ?


ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ వినియోగదారులకు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం హెచ్చరిక జారీ చేసింది. ఈ బ్రౌజర్‌లో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఫలితంగా ఈ బ్రౌజర్‌లపై దాడిచేసి రిమోట్‌గా కోడ్‌లను రన్‌ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఫైర్‌ఫాక్స్ వెర్షన్‌ 124 కంటే ముందు మరియు ఫైర్‌ఫాక్స్‌ ESR వెర్షన్‌ 115.9 కంటే ముందు వెర్షన్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొజిల్లా థండర్‌బర్డ్ వెర్షన్‌ 115.9 కంటే ముందు వెర్షన్‌లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. విండోస్‌ లో ఎర్రర్‌ రిపోర్ట్‌ కారణంగా మొజిల్లా ఉత్పత్తుల్లో లోపాలున్నట్లు Cert-in తెలిపింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు ఈ బ్రౌజర్లపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ద్వారా మొజిల్లా బ్రౌజర్‌లు కలిగి ఉన్న పరికరాల్లోని డేటాను దొంగిలించే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితిని నుంచి యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచేందుకు కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం కీలక సూచనలు చేసింది. యూజర్లు వెంటనే తమ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాలని సూచించింది. దీంతోపాటు ఇటువంటి అప్‌డేట్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ అయ్యేలా సిస్టమ్‌ సెట్టింగ్స్‌ మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతోపాటు యాంటీ మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్‌లను తమ పరికరాల్లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. సురక్షితమైన బ్రౌజింగ్‌ కోసం ముందస్తు జాగ్రత్తలు ముఖ్యం. బ్రౌజింగ్‌ సమయంలో లింక్‌లు క్లిక్‌ చేసినప్పుడు, డౌన్‌లోడ్‌ చేసినప్పుడు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇతర వెబ్‌సైట్‌లలోకి వెళ్లినప్పుడు జాగ్రతలు వహించాలి. సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు సహా బ్రౌజర్‌ అప్‌డేట్‌లను నిరంతరం పరిశీలిస్తుండాలి.ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీని గుర్తిస్తే సంబంధిత విభాగాలను వెంటనే సమాచారం అందించాలి. సైబర్‌ అటాక్‌ల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న సమయంలో తెలియని గుర్తు తెలియని వెబ్‌ సైట్లు, లింక్‌లను క్లిక్‌ చేయకపోవడం ఉత్తమం. గత కొన్ని రోజుల ముందు గూగుల్‌ క్రోమ్‌లోని లోపాలను సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించి అప్రమత్తం చేసింది.సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్‌ క్రోమ్‌ తన యూజర్ల భద్రత కోసం కీలక చర్యలు తీసుకుంటుంది. సేఫ్‌ బ్రౌజింగ్‌ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా మాల్వేర్‌ అటాక్‌ సహా సైబర్ అటాక్‌ల సమయంలో వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది.


 

Post a Comment

0 Comments

Close Menu