Ad Code

కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరించి రూ. 80లక్షలకు మోసం ?


హారాష్ట్ర లోని నవీ ముంబైలో నివసిస్తున్న 63 ఏళ్ల మహిళ ఓ విద్యుత్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లోని వాషిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు ఒక ప్రముఖ అంతర్జాతీయ కొరియర్ కంపెనీ, ప్రభుత్వ అధికారుల ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్లు రూ. 80 లక్షలు కాజేయడానికి ప్రయత్నించారు. స్మగ్లింగ్ కేసులో చట్టపరమైన పరిణామాల నుంచి రక్షణ కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి ఆమె నుంచి డబ్బులు వసూలు చేశారు. మార్చి 29న, బాధితురాలికి అంతర్జాతీయ కొరియర్ సర్వీస్ కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె పేరుతో స్మగ్లింగ్ వస్తువులతో కూడిన పార్శిల్ వచ్చిందని కాల్ చేసిన వ్యక్తి ఆమెకు తెలియజేసాడు. దీంతో ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నాడు. సైబర్ పోలీస్ స్టేషన్ అధికారి అని చెబుతూ వేరే వ్యక్తితో మాట్లాడించాడు. ఆ తర్వాత బాధితురాలికి స్కైప్ ఖాతా ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరుతో నకిలీ లేఖలు అందాయని ఆమె పేర్కొన్నారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు ఆమెను త్వరలో అరెస్ట్ కూడా చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమెతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి సహాయం అందిస్తామని చెప్పి వివిధ బ్యాంకు ఖాతాలలోకి రూ.80 లక్షలు బదిలీ చేయమని మహిళను ఒత్తిడి చేశారు. ఆ తర్వాత అసలు విషయం అర్థమై ఆ మహిళ సైబర్ క్రై పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని వివరించింది. ఏప్రిల్ రెండో తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు గుర్తు ఆమెకు ఫోన్ చేసిన తెలియని వ్యక్తులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420 (మోసం), 465, 468, 471 (ఫోర్జరీ), 170 (ప్రభుత్వ సేవకుడిగా నటించడం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 34 (సాధారణ ఉద్దేశం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu