Ad Code

సెల్ టవర్లతో అవసరం లేకుండానే మొబైల్‌ ఫోన్‌లకు శాటిలైట్‌ కనెక్టివిటీ ?


మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో 'శాటిలైట్' కనెక్టివిటీని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇక నుంచి సెల్ టవర్లతో అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా 'టియాంటాంగ్-1' సిరీస్‌కు చెందిన మరో ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. తాజా ప్రయోగం సక్సెస్‌తో చైనా కక్ష్యలోకి పంపిన 'టియాంటాంగ్-1' సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరింది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా మొబైల్ ఉపగ్రహ కనెక్టివిటీకి మార్గం సుగమం చేసిందని, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 'శాటిలైట్ కనెక్టివిటీ' కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన మొదటి కంపెనీగా Huawei ఇప్పటికే గుర్తింపు పొందింది. Xiaomi, Honor, Oppo స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తాజాగా ఈ జాబితాలో చేరాయి.


Post a Comment

0 Comments

Close Menu