Ad Code

లోక్ సభ ఎన్నికల్లో రూ.1100 కోట్ల విలువగల సొమ్ము జప్తు !


రేపు జరగనున్న ఏడో దశ పోలింగ్ తో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుక్షణం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగా దేశవ్యాప్తంగా అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి ఎన్నికల్లో ప్రలోభాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఆదాయ పన్నుశాఖ అధికారులు రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి16వ తేదీ నుంచి మే 30వరకు 11 వందల కోట్ల విలువ ఉంటుందని అంచనా. 2019లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల విలువ చేసే బంగారం, డబ్బును సీజ్‌ చేయగా ప్రస్తుతం అది అంతకు 182 శాతం ఎక్కువని ఐటీ శాఖ ప్రకటించింది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయగల, లెక్కల్లో చూపని సొమ్ముగా పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటకల నుంచే సొమ్ము సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఒక్కో రాష్ట్రంలో 200 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తమిళనాడులో 150 కోట్లకు పైగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశాలలో 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu