Ad Code

13న ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజిన్ విడుదల ?


చాట్ జీపీటీ చాలా తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది. మే 13న ఏఐ సెర్చ్ ఇంజిన్ ప్రొడక్టును ఓపెన్ ఏఐ విడుదల చేయబోతోంది. ఇది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్‌తో యూజర్లకు సరైన సమాధానాలు, సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్ వార్షిక I/O సదస్సు మే 14న జరగనుంది. దీనికి సరిగ్గా ఒకరోజు ముందు ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజిన్ ప్రోడక్ట్ లాంచ్ కానుండటం వ్యూహాత్మక నిర్ణయమే అని తెలుస్తోంది. మే 14న జరగనున్న గూగుల్ వార్షిక సదస్సు వేదికగా గూగుల్ కంపెనీ కూడా కొన్ని ఏఐ ఫీచర్లను విడుదల చేయనుందని సమాచారం. ఓపెన్ ఏఐ లాంఛ్ చేసిన చాట్ జీపీటీ యూజర్ల ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలో సమాధానాలు ఇస్తోంది. దీని కోసం అడ్వాన్స్ డ్ ఏఐ మోడల్స్ ను కంపెనీ వాడుతోంది. అయితే అది అందించే సమాచారం విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అప్ టు డేట్ వెబ్ కంటెంట్ ను అందించడంలో చాట్ జీపీటీ ఫెయిల్ అవుతోందనే విశ్లేషణ ఉంది. ఓపెన్ ఏఐ విడుదల చేయబోయే సెర్చ్ ఇంజన్ ప్రోడక్ట్ నుంచి గూగుల్‌తో పాటు ఏఐ సెర్చ్ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీకి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓపెన్ ఏఐ మాజీ సైంటిస్టు ఒకరు 'పర్‌ప్లెక్సిటీ ఏఐ' కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ విలువ 1 బిలియన్ డాలర్లు. ఇది చక్కటి సెర్చ్ ఇంటర్ఫేస్‌ను అందిస్తోంది. చాలా ప్రత్యేకమైన రీతిలో యూజర్లకు రెస్పాన్స్‌ను ఇది అందిస్తోంది. సైటేషన్స్, ఇమేజెస్, టెక్ట్స్ రూపంలో యూజర్లు అడిగిన సమాచారానికి బదులిస్తోంది. ప్రస్తుతం దీనికి నెలకు కోటి మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu