Ad Code

16న ఐక్యూ జెడ్ 9x 5జి స్మార్ట్ ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లో మే 16న ఐక్యూ జెడ్ 9x 5జి స్మార్ట్ ఫోన్ ను చేయబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ఫీచర్స్ తో అమెజాన్ మైక్రో సైట్ పేజి ను అందించి, దాని ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.72 ఇంచ్ బిగ్ డిస్ప్లే ఉన్నట్లు ఐక్యూ తెలిపింది. ఈ జెడ్ 9x 5జి ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6 Gen 1 5G ప్రోసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ మరింత పెర్ఫార్మెన్స్ అందించేందుకు, ఇందులో 8GB ఫిజికల్ RAM, 8GB Extended RAM తో కూడా జతగా వస్తుందని ఐకూ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో 1TB వరకు ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు డ్యూయల్ టోన్ ఫ్లాష్ కూడా వుంది. ఈ ఫోన్ ను హెవీ 6000 mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా తీసుకు వస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఇవి కాకుండా, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP64 వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐక్యూ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu