Ad Code

ఆపిల్ నుంచి అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్ లాంచ్ ?


వచ్చే సంవత్సరం మార్కెట్లో ఆపిల్ నుంచి ఐఫోన్ 17 స్లిమ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. ప్రస్తుతం ఉన్న లైనప్లో దీన్ని యాడ్ చేస్తారా? లేక ఏదైనా మోడల్ ను తీసేసి దాని ప్లేస్లో తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ నాలుగు మోడల్స్ ను ఫిక్స్ డ్  గా లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం యాపిల్ లైనప్లో ఉన్న అన్ని ఫోన్ల కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. జీఎస్ఎంఎరీనా కథనం ప్రకారం యాపిల్ తన ఐఫోన్ 17 స్లిమ్ మోడల్ ను 2025లో లాంచ్ చేయనుంది. 2024 సెప్టెంబర్ లో యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ తన ప్లస్ మోడల్ ను లైనప్ లో ఉంచుతుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఐఫోన్ 13 మినీ స్థానంలో ఐఫోన్ 14 సిరీస్లో ఐఫోన్ 14 ప్లస్ ను యాపిల్ లాంచ్ చేసింది. యాపిల్ 2025లో లాంచ్ చేయనున్న అన్ని ఫోన్లలో ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఈ నెల ప్రారంభంలో ఐప్యాడ్ ప్రో (2024)ను కంపెనీ లాంచ్ చేసింది. దీని ముందు వెర్షన్ కంటే ఈ మోడల్ చాలా సన్నగా ఉంది. ఐఫోన్ 17 స్లిమ్ డిజైన్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి ఫోన్ వెనకవైపు మధ్యలో యాపిల్ కెమెరా సెటప్ను అందిస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన లీకుల ప్రకారం ఐఫోన్ 17 సిరీస్లో డైనమిక్ ఐల్యాండ్ సైజు మరింత తగ్గనుంది. ఐఫోన్ 17 స్లిమ్ స్క్రీన్ సైజు 6.6 అంగుళాలుగా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 17లో 6.1 అంగుళాలు, ఐఫోన్ 17 ప్రోలో 6.3 అంగుళాలు, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల డిస్ ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. 


Post a Comment

0 Comments

Close Menu