Ad Code

ప్రకటన రహిత కంటెంట్‌తో జియో వార్షిక ప్రీమియం రూ.299లకే ?


జియో టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉచిత సిమ్ములు, తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా, కాలింగ్‌ ప్యాక్‌లను తీసుకువచ్చిఅప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌లకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఇక జియో దెబ్బకు మిగతా టెలికాం కంపెనీలు కూడా దిగి రాక తప్పలేదు. దాంతో కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా అందుబాటులోకి వచ్చింది. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఓటీటీల రంగంలో అమలు చేయడానికి జియో రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఓటీటీ రంగంలో ముందు వరుసలో ఉన్న నెట్‌ఫ్లిక్స్-అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ముఖేష్ అంబానీ సరికొత్త ప్లాన్‌ వేశారు. దీనిలో భాగంగా రిలయన్స్ జియో తన ఓటీటీ వినియోగదారులకు భారీ బహుమతిని అందించింది. కంపెనీ ప్రీమియం యాన్యువల్ పేరుతో కొత్త యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇక ఈ ప్లాన్ వార్షిక ధర కేవలం 299 రూపాయలు మాత్రమే కావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వార్షిక ప్లాన్‌లకు వేలకు వేలు ఖర్చవుతుండగా, ముఖేష్ అంబానీ కేవలం రూ. 299కి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా వార్షిక ప్లాన్‌ను ప్రారంభించడం ఈ కంపెనీలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఈ కొత్త యాడ్ ఫ్రీ ప్లాన్ ధర 12 నెలల కాలానికి గాను కేవలం రూ.299 మాత్రమే. ప్రకటన రహిత కంటెంట్‌ను ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. కొత్త ప్రీమియం వార్షిక ప్లాన్‌తో మీరు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రకటనలు లేకుండా 'ప్రీమియం'తో సహా మొత్తం కంటెంట్‌ను చూడవచ్చు. ఇది కాకుండా మీరు 4కే నాణ్యతతో కూడిన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. మీరు మొబైల్ యాప్‌లో ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్‌లో కనెక్ట్ చేయబడిన టీవీతో సహా ఏదైనా గాడ్జెట్‌లో ప్రత్యేకమైన సిరీస్‌లు, చలనచిత్రాలు, హాలీవుడ్ కంటెంట్, పిల్లల షోలు, టీవీ కార్యక్రమాలు చూసే సదుపాయం ఉంది. ఈ 299 వార్షిక ప్రీమియం జియో సినిమా ప్లాన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీరు జియో సినిమా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా దీనిని సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక స్క్రీన్ లేదా అంతకంటే ఎక్కువ వాటికి యాక్సెస్‌ను అందిస్తుందా లేదా అనే దాని గురించి జియో న ఉంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇ​క నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే.. వీటి నెల వారి సబ్‌స్క్రిప్షన్ పొందడానికి రూ.99-రూ.149 వరకు చెల్లించాలి. దీని తర్వాత, ఫీచర్లు, వీడియో నాణ్యత ప్రకారం ప్లాన్ ధర పెరుగుతూనే ఉంటుంది. వీటితో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే జియో ఏడాది పాటు కంటెంట్‌ చూసే అవకాశం కల్పిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu