Ad Code

అమెజాన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎం34 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్ !


మెజాన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎం34 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16,999 గా ఉంది. అమెజాన్‌లో ఈ శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,299 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.11,700 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2340 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ పొందుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు Exynos 1280 ప్రాసెసర్‌ ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4 OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ర్యామ్‌ ను 12GB వరకు విస్తరించుకోవచ్చు. మరియు మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం డిస్కౌంట్‌ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా 50MP OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కలిగి ఉంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్‌తో వస్తుంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో వచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై, బ్లూటూత్‌ సహా GPS వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఫేస్ లాక్‌ సహా సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ శాంసంగ్‌ గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, ప్రిజం సిల్వర్‌, వాటల్‌ఫాల్‌ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu