Ad Code

రేవ్‌ పార్టీ డ్రగ్స్‌ టెస్ట్‌లో 86 మందికి పాజిటివ్‌ !


బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ డ్రగ్స్‌ టెస్టులో 86 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు నార్కోటిక్‌ టీమ్‌ తెలిపింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్‌ టీమ్‌ సేకరించగా అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా నటి హేమకు కూడా పాజిటీవ్‌గా నిర్ధరాణ అయినట్లు సమాచారం. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. 'సన్‌ సెట్‌ టు సన్‌ రైజ్‌ విక్టరీ' పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగం చేసి 150 మందిని అదుపులోకి తీసుకున్నావిషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu