Ad Code

మాజీ అధికారి హత్య కేసులో డేరా బాబాను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు !


ర్యానా కోర్టు హైకోర్టు ఓ మాజీ అధికారి హత్య కేసులో డేరాబాబాను నిర్దోషిగా ప్రకటించింది. హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమం మాజీ అధికారి రంజిత్‌ సింగ్‌ జులై 10, 2002న హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో డేరా బాబాతోపాటు, మరో నలుగురిపై తానేసర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2003లో ఈ హత్యకేసును విచారణ దర్యాప్తు చేయాలని చండీగఢ్‌ హైకోర్టు సిబిఐను ఆదేశించింది. విచారణ అనంతరం డేరాబాబాతోపాటు జస్బీర్‌ సింగ్‌, సబ్దిల్‌సింగ్‌, క్రిషన్‌లాల్‌, అవతార్‌సింగ్‌లకు సిబిఐ ప్రత్యేకకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను డేరాబాబా హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రంజిత్‌సింగ్‌ హత్యకేసులో 21 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత డేరాబాబా నిర్దోషిగా తేలారు.

Post a Comment

0 Comments

Close Menu