Ad Code

మళ్లీ పెరిగిన బంగారం ధర !


మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలో మార్పు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గడం లాంటివి ఈ ధరల హెచ్చుతగ్గులకు కారణమై ఉండొచ్చునని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,010కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ. 73,090 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,940 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,410గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,540 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,940 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,940 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,940గా ఉంది. విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,860, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,940 వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu