Ad Code

ఐఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి ఆపిల్‌ సంస్థ సూచనలు జారీ !


ఫోన్‌ వినియోగదారులకు బ్యాటరీ లైఫ్‌ రావాలంటే  ఆపిల్‌ సంస్థ కొన్ని సూచనలు చేసింది. కొన్ని కారణాల వల్ల ఐఫోన్ బ్యాటరీ తక్కువ సమయంలోనే డిశ్చార్జీ అవుతోంది. అయితే సక్రమంగా వినియోగించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందుతారని ఆపిల్‌ తెలిపింది. ఆపిల్‌ సంస్థ విడుదల చేసిన అప్‌ డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సంస్థ సూచించింది. ఈ అప్‌డేట్స్‌లో కేవలం అదనపు ఫీచర్లే కాకుండా పాత వెర్షన్‌లోని సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని తెలిపింది. ఆపిల్‌ సంస్థ నుంచి వస్తున్న అప్‌ డేట్‌లను వినియోగించుకోవడం ద్వారా ఐఫోన్ పనితీరును మెరుగుపరచడం సహా బ్యాటరీ లైఫ్‌ ను కూడా పెంచుకోవచ్చు. ఐఫోన్‌ను ఎప్పుడూ అప్ టూ డేట్‌గా ఉంచడం ద్వారా అనేక మంచి ఫలితాలు ఉంటాయని ఆపిల్ సంస్థ సూచించింది. 16 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ మధ్య మెరుగైన పనితీరును కనబరిచేలా ఆపిల్‌ సంస్థ తయారు చేసింది. అయితే ఉష్ణోగ్రత పెరిగే కొద్ది ఐఫోన్ బ్యాటరీ పై ప్రభావం చూపుతుంది. 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఐఫోన్ బ్యాటరీ పూర్తిగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రత బ్యాటరీ జీవిత కాలంపైనా ప్రభావం చూపుతుంది. దీంతోపాటు అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా బ్యాటరీపై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే బ్యాటరీ డిశ్చార్జీ అవుతుంది. అందువల్ల ఆపిల్‌ సంస్థ అనుమతించిన ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం ఉత్తమం. ఛార్జింగ్ సమయంలో ఐఫోన్‌ల కేస్‌లు హ్యాండ్‌సెట్‌ వేడెక్కేందుకు కారణం అవుతాయి. ఇది బ్యాటరీ లైఫ్‌పై చెడు ప్రభావం చూపుతుంది. ఛార్జింగ్‌ సమయంలో మీ హ్యాండ్‌సెట్‌ వేడెక్కుతున్నట్లు మీరు భావిస్తే వెంటనే ఆ కేస్‌ను తీసివేయాలి. కేస్‌ తీసివేయడం వల్ల ఉష్ణోగ్రత చెడు ప్రభావం చూపకుండా నివారించవచ్చు. ఆపిల్‌ ఐఫోన్‌ ను ఎక్కువ కాలం వినియోగానికి దూరంగా ఉంచాల్సి వచ్చిన సమయంలో మరియు హ్యాండ్‌ సెట్‌ స్విచ్‌ ఆఫర్‌ ఆఫ్‌ చేసే ముందు బ్యాటరీ ఛార్జింగ్‌ కనీసం 50 శాతం ఉండేలా చూసుకోండి. పూర్తి ఛార్జింగ్‌ లేదా పూర్తిగా ఛార్జింగ్‌ లేకుండా స్విచ్‌ ఆఫ్ చేయడం కారణంగా బ్యాటరీ లైఫ్ పై చెడు ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ఐఫోన్‌ను కొంత కాలం పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు 32 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. ఫలితంగా బ్యాటరీ డ్యామేజీ కాకుండా ఉంటుంది. iOS 9 అప్‌డేట్‌ లో ఆపిల్‌ సంస్థ లో పవర్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ తగ్గించి, యానిమేషన్‌ను మినిమైజ్‌, బ్యాగ్రౌండ్‌ యాప్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. దీంతోపాటు ఈ లో పవర్‌ మోడ్‌ బ్యాటరీ ఛార్జింగ్ 20 శాతం మరియు 10 శాతం ఉన్నప్పుడు కూడా యాక్టివేట్‌ అవుతుంది. ఐఫోన్‌ సెట్టింగ్‌ లోకి వెళ్లి యాక్టి వేట్‌ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌ లోని బ్యాటరీ ఆప్షన్‌ వద్ద లో పవర్‌ మోడ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ఫలితంగా ఫోన్‌లోని బ్యాగ్రౌండ్‌ ఆపరేషన్‌లు నిలిచిపోతాయి. 

Post a Comment

0 Comments

Close Menu