Ad Code

యూట్యూబ్‌లో జంప్ ఏహెడ్, ఆస్క్ ఫీచర్లు ?


యూట్యూబ్  రెండు ఏఐ ఫీచర్లను జంప్ ఏహెడ్, ఆస్క్ పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఏఐ పవర్డ్ జంప్ ఏహెడ్ ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. సాధారణంగా యూట్యూబ్ లో వీడియోలు చూసినప్పుడు కొన్ని విభాగాలను ఫార్వార్డ్ చేస్తుంటాం. కొత్త ఫీచర్ ఇలాంటి సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఫార్వార్డ్ చేయాల్సిన వీడియోల విభాగాలను మరింత ఎంతో సమర్థంగా దాటవేయడానికి వీలుంటుంది. జంప్ ఎహెడ్ అనే కొత్త ఏఐ పవర్డ్ ఫీచర్‌ను మరింత మంది ప్రీమియం సభ్యులకు యూట్యూబ్ అందజేస్తోంది. తద్వారా వారు వీడియోల విభాగాలను మరింత సమర్థవంతంగా ఫార్వార్డ్ చేయడానికి వీలుంటుంది. వీడియోలో తరచుగా దాటవేయబడిన విభాగాలను గుర్తించడానికి ఈ ఫీచర్ మెషీన్ లెర్నింగ్, వీక్షణ డేటా (వ్యూయింగ్ డేటా)ను ఉపయోగిస్తుంది, వీక్షకులు నేరుగా తమకు నచ్చిన విభాగాలకు వెళ్లేలా చేస్తుంది. గతంలో 10 సెకన్ల ఇంక్రిమెంట్‌లో ముందుకు వెళ్లడానికి స్క్రీన్‌ని పదే పదే నొక్కేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. యూట్యూబ్ కొత్తగా జంప్ ఎహెడ్ అనే ఫీచర్‌ను అందిస్తుంది. వీడియోలో ముందుకు వెళ్లడానికి రెండుసార్లు నొక్కిన తర్వాత ఒక బటన్ కనిపిస్తుంది. ఇది చాలా మంది వ్యూయర్స్ ( వీక్షకులు) సాధారణంగా స్కిప్ చేసే చోటుకి వెళ్లడాన్ని సూచిస్తుంది. ఈ పిల్-ఆకారపు జంప్ ఏహెడ్ బటన్ స్క్రీన్ దిగువన కుడివైపు మూలలో ఉంటుంది. దానిని వెంటనే ఉపయోగించకపోతే అదృశ్యమవుతుంది. దీనిని మార్చి ప్రారంభంలో పరీక్షించారు. ఇప్పుడు యూట్యూబ్ న్యూ పేజీ ద్వారా ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంది. జంప్ ఏహెడ్ అనే బటన్ ను నొక్కిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం బ్యాడ్జ్ తో 'జంపింగ్ ఓవర్ కామన్లీ స్కిప్పిడ్ సెక్షన్' అనే దానిని యూజర్ల చూస్తారు. ప్రస్తుతం యూఎస్ లో ఆంగ్ల వీడియోల కోసం యూట్యూబ్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, ప్రాంతాలకు కూా విస్తరించే అవకాశం ఉంది. వీక్షించే డేటాను విశ్లేషించడానికి, వీడియోలో తదుపరి వచ్చే ఆసక్తికర విషయాలను గుర్తించడానికి ఈ ఫీచర్ మెషీన్ లెర్నింగ్‌ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న డబుల్-ట్యాప్ స్కిప్ ఫీచర్ మాదిరిగానే జంప్ ఎహెడ్ పని చేస్తుంది. ఇది వీడియోను 10 సెకన్ల ఇంక్రిమెంట్‌లో ముందుకు తీసుకువెళుతుంది. యూట్యూబ్ ఎక్స్ పర్మెంట్ పేజీ ప్రీమియం సభ్యులకు వారి ప్రత్యేక ఆఫర్‌లలో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. ప్రీమియం సభ్యులు జూన్ 1 వరకు ఈ ప్రయోగాన్ని ప్రారంభించవచ్చు, అయితే ప్రీమియం సబ్‌స్క్రైబర్లు చూసే వీడియోలలో ఏవి ఈ ఫీచర్ కు వర్తిస్తాయో కంపెనీ తెలపలేదు. జంప్ ఏహెడ్ ఫీచర్లను పరిక్షించాలనుకునే ప్రీమియం సభ్యులు దానిలోని సెట్టింగ్స్ లోకి వెళ్లి, ట్రై ఎక్సపర్మెంటల్ న్యూ ఫీచర్లో ప్రయత్నించాలి. అయితే ఈ ఫీచర్‌కు ఏ వీడియోలు అర్హత కలిగి ఉంటాయో యూట్యూబ్ వెల్లడించలేదు కానీ అధిక వీక్షకుల వీడియోలలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. జంప్ ఎహెడ్ తో పాటు ఏఐ రూపొందించిన ఆస్క్  అనే ప్రశ్నల ఫీచర్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు. ఈ ఏఐ ఆధారిత ఫీచర్లు మెషీన్ లెర్నింగ్, డేటా విశ్లేషణ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంలో యూట్యూబ్ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆస్క్ అనేది ఎక్స్ పర్మెంటల్ కాన్వర్సేషనల్ ఏఐ టూల్. ఇది వినియోగదారులు వీడియోలు చూస్తూ ప్రశ్నలను అడగడానికి అనుమతిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉండే కనీసం 18 ఏళ్ల వయస్సు ఉన్న యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కోసం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆస్క్ ఫీచర్‌ని ఉపయోగించే వీక్షకులు తప్పనిసరిగా తమ ఖాతా కోసం దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆపై అర్హత ఉన్న వీడియోల క్రింద ఉన్న ఆస్క్ బటన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ప్రశ్నలను టైప్ చేయడం, సారాంశాలు, కంటెంట్ సిఫార్సుల వంటి సూచించబడిన ప్రాంప్ట్‌ల నుంచి ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఏఐ వీడియో కంటెంట్, ప్రశ్నను ప్రాసెస్ చేస్తుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు సంబంధిత సమాధానాలను అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu