Ad Code

దేశంలో సన్‌రూప్ ఉండే కార్లకు పెరుగుతున్న డిమాండ్ ?


దేశంలో సన్‌రూప్ ఉండే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. వెహికల్స్‌కు ఇది లగ్జరీ టచ్ ఇస్తుంది. ఇప్పుడు సబ్-4 మీటర్ల విభాగంలోని వాహనాలు, SUVలు కూడా ఈ ఫీచర్‌తో వస్తున్నాయి. కొన్ని కంపెనీలు పనోరమిక్ సన్‌రూఫ్స్ సైతం అందిస్తున్నాయి.  మారుతి సుజుకి లైనప్‌లో సన్‌రూఫ్‌తో వచ్చిన ఫస్ట్ మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా. సన్‌రూప్ ఫీచర్‌తోనే SUV చాలా మంది కొత్త కస్టమర్లను ఆకర్షించింది. ఈ వెహికల్ ZXi ట్రిమ్స్ మాత్రమే సన్‌రూఫ్ ఆప్షన్‌తో వస్తాయి. మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వాహనాలలో టాటా నెక్సాన్ ఒకటి. ఇది వివిధ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. సన్‌రూఫ్ ఫీచర్ Smart + S వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది వాయిస్-యాక్టివేట్ ఫీచర్‌గా వస్తుంది. నెక్సాన్ ధర రూ. 8.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మోడల్ 120hp పవర్, 170Nm టార్క్ ఇస్తుంది. అలాగే 1.5-లీటర్ డీజిల్ ఎడిషన్ 110hp పవర్, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్‌లో కియా సోనెట్ బెస్ట్ సబ్-4 మీటర్ SUVగా పాపులర్ అయింది. ఈ వెహికల్ రెండు పెట్రోల్ ఇంజిన్స్, ఒక డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. అయితే సన్‌రూఫ్ ఫీచర్ HTE(O) వేరియంట్‌లో అందుబాటులో ఉంది. కియా సోనెట్ ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. LED DRLsతో వచ్చే LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్, పుష్-బటన్ స్టార్ట్‌తో స్మార్ట్ కీ, స్మార్ట్ కీపై రిమోట్ ఇంజన్ స్టార్ట్, HD టచ్‌స్క్రీన్ నావిగేషన్ మరిన్ని ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. హ్యుందాయ్ వెన్యూ S+, S(O) వెర్షన్లు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌తో రిలీజ్ అయ్యాయి. అయితే SX వేరియంట్ నుంచి వాయిస్-యాక్టివేటెడ్ వెర్షన్ ఉంటుంది. వెన్యూ ధర రూ.7.94 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, మరిన్ని ఫీచర్లు దీని సొంతం. సన్‌రూఫ్ ఫీచర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. మహీంద్రా XUV 3XO ఎడిషన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ADAS లెవల్ 2 దీని మరో ప్రత్యేకత. దీని ధర రూ. 7.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu