Ad Code

పలు రాష్ట్రాలకు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ !

రేపు పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని, అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, జార్ఖండ్, ఒడిశాలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. తేలికైన, వదులు దుస్తులు ధరించాలని తెలిపింది. అలాగే వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. హీట్‌వేవ్‌ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu