Ad Code

మూత్ర పిండాలు - ఆహార నియమాలు !


మూత్ర పిండాలు ఆరోగ్యంగా పని చేస్తేనే శరీరంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు కిడ్నీలు 90 శాతం పాడైపోయిన తర్వాతే లక్షణాలు బయట పడుతున్నాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలి. కిడ్నీలు పాడైపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, పాదాల్లో నీరు చేరుతుంది. కళ్లు ఉబ్బడం, మూత్ర విసర్జన కష్టంగా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార నియమాలు ఉపయోగపడతాయి. పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లలో సహజంగా సోడియం, పొటాషియం అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. యాపిల్, బెర్రీలు, ద్రాక్ష, పియర్స్, పుచ్చకాయ వంటివి తింటే మంచిది. పెరుగు, చీజ్, కొవ్వు తీసిన పాలు తినడం వల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో క్యాల్షియం, విటమిన్ డి అనేవి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చక్కగా హెల్ప్ చేస్తాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా తినడం వల్ల కూడా కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇవి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌లను తగ్గించడానికి సహాయ పడుతుంది. తృణ ధాన్యాలు తినడం వల్ల కిడ్నీలు, శరీరం రెండూ హెల్దీగా ఉంటాయి. చేపలు, చికెన్, బీన్స్ వంటి వాటిల్లో లీన్ ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల బరువు అనేది పెరగరు. కిడ్నీల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో బ్రోకలీ, క్యాబేజీ, కాలీ ఫ్లవర్, ఆకుకూరలు కూడా చక్కగా పని చేస్తాయి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటివి ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu