Ad Code

అమెజాన్ లో వన్ ప్లస్ 11ఆర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !


వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11ఆర్ పై 40 వేల ధరలో ఇండియాలో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. గడిచిన సమ్మర్ సేల్ తర్వాత, ఇప్పుడు మరొకసారి ఈ ఫోన్ మరింత చవక ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ లో సోనీ కెమెరా సెటప్ మొదలుకొని ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ వరకు చాలా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ పైన అమెజాన్ ఇండియా రూ. 12,000 ప్రకటించడంతో రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ కి అందుబాటులోకి వచ్చింది.  వన్ ప్లస్ 11ఆర్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ సెట్ మరియు 8GB LPDDR5X RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 50MP Sony IMX 890 మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ కెమెరాతో అల్ట్రా HDR ఫోటోలు విడీఓలను షూట్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ ను 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వన్ ప్లస్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే కూడా వుంది. 6.7 ఇంచ్ సూపర్ ఫ్లూయిడ్ AMAOLED డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో ఈ ఫోన్ కలిగి వుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్, 10 బిట్ కలర్ డెప్త్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి వుంది.

Post a Comment

0 Comments

Close Menu