Ad Code

కౌంటింగ్‌లో 140కి పైగా నియోజకవర్గాల్లో గోల్‌మాల్‌ ?


లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్‌ వెబ్‌సైట్‌ 'ది వైర్‌’లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్‌ సంచలనంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయని పేర్కొన్నది. 543 నియోజకవర్గాలకుగానూ డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, కేరళలో అట్టింగల్‌ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని, పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సరిపోలడం లేదని తెలిపింది. ఏకంగా 140కిపైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని, ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3,811 ఓట్ల వరకు ఉన్నదని ఇండిపెండెంట్‌ జర్నలిస్టు పూనమ్‌ అగర్వాల్‌ తన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించిన నియోజకవర్గాలు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయని చెప్పారు.కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కింపు మధ్య రెండు ఓట్ల తేడా ఉన్నదని అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆయా స్థానాల్లో చాలా తక్కువ మార్జిన్‌తో గెలుపోటముల నిర్ణయం జరిగిందని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu