Ad Code

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఐఫోన్ 15 ను రూ. 15,000 భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఇండియాలో రూ. 79,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో ఈ ఫోన్ వచ్చింది. ఈరోజు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 64,999 రూపాయల ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC Bank Credit Card Non EMI ఆప్షన్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే అందుకునే వీలుంది. ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే డైనమిక్ ఐల్యాండ్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ట్రూ టోన్ తో వస్తుంది. ఈ ఫోన్ యాపిల్ లేటెస్ట్ A16 బయోనిక్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ కలర్ లలో లభ్యమవుతుంది.  ఐఫోన్ 15 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ / టెలి ఫోటో కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ కెమెరాతో టన్నుల కొద్దీ ఫీచర్లు మరియు ఫిల్టర్లు ఉంటాయి. ఐఫోన్ 15 ఫోన్ 24fps మొదలుకొని 60fps 4K వీడియోల కోసం సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4K వీడియో సపోర్ట్ కలిగిన 12MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ Dolby Atmos ఆడియో సపోర్ట్ తో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu