Ad Code

దేశీయ మార్కెట్లో హానర్ 200 సిరీస్‌ త్వరలో లాంచ్‌ ?


దేశీయ మార్కెట్‌ లో హానర్ 200 సిరీస్‌ ను లాంచ్‌ చేస్తున్నట్లు సంస్థ టీజర్‌ ద్వారా వెల్లడించింది.ఈ సిరీస్‌ లో భాగంగా హానర్ 200, హానర్‌ 200 ప్రో లాంచ్‌ కానున్నాయి. ఈ రెండు ఇటీవల చైనాలో విడుదల అయ్యాయి. అయితే ఈ హానర్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లు అమెజాన్‌ ద్వారా విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్‌ పేజీ అమెజాన్‌లో కనిపిస్తోంది. అయితే ఇందులోనూ భారత్ విడుదల తేదీ వివరాలు వెల్లడించలేదు. అయితే పారిస్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ లాంచ్ ఈవెంట్‌ జూన్‌ 12 న జరుగుతుంది. ఇందులో ఈ సిరీస్‌ను లాంచ్‌ చేయనున్నారు. అదే రోజు భారత్‌ మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ OLED డిస్‌ప్లే మరియు 2664*1200 పిక్సల్‌ రిజల్యూషన్‌ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, 50MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది. 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 16GB ర్యామ్‌ మరియు 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Magic OS 8.0 పైన పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ హనర్ 200 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ సిమ్ సహా 5G సపోర్టును పొందుతుంది. మరియు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. హానర్‌ 200 ప్రో హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల HD+ OLED డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Magic OS 8.0 పైన పనిచేస్తుంది. స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 16GB ర్యామ్ సహా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా పరంగా బేస్ వేరియంట్‌ మాదిరిగానే ఉంటుంది. దీంతోపాటు అదనంగా 3D డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu