Ad Code

ఏప్రిల్‌ నెలలో 71 లక్షల వాట్సాప్‌ అకౌంట్లపై నిషేధం ?


వాట్సాప్‌ ఏప్రిల్‌ 2024 లో ఏకంగా 71 లక్షల అకౌంట్లపై నిషేధం విధించినట్లు తెలిపింది. భారత్‌ ఐటీ చట్టం 2021 నిబంధలను ఉల్లంఘించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. వాట్సాప్‌ యూజర్లు తన ఫిర్యాదులను మెయిల్‌ ద్వారా పంపవచ్చని పేర్కొంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రీవెన్స్‌ విభాగానికి వివిధ అంశాలపై 10,554 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. దీంతోపాటు రిపోర్టు ఫీచర్‌ ద్వారా వచ్చిన నివేదికలు సహా ఇతర పర్యవేక్షణ విభాగాల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఏప్రిల్‌ నెలలో 7,182,000 భారతీయ వాట్సాప్‌ ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు తెలిపింది. ఇందులో 1,302,000 ఖాతాలను యూజర్ల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండా ముందస్తుగా నిషేధం విధించినట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌ భద్రత పర్యవేక్షణకు వాట్సాప్‌కు నిపుణులతో ప్రత్యేక వ్యవస్థ ఉంది. యాప్‌లోనే యూజర్లు ఇతరుల ఖాతాలను బ్లాక్‌ చేయడం మరియు వాటిపై రిపోర్టు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. వాట్సాప్‌ వినియోగదారుల ఫిర్యాదులు సహా ఇతర ఫీడ్‌బ్యాక్‌పై వెంటనే సాయం చేసేలా ప్రత్యక వ్యవస్థ ఉంటుంది. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ సహా నకిలీ వార్తల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థలకు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu