Ad Code

నిపుణులు దొరకక టీసీఎస్‌ 80 వేల ఉద్యోగాలు ఖాళీ ?


టాటా కన్‌సల్టెన్సీ సర్వీసెస్‌లో దాదాపు 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఈ 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంస్థ నానా కష్టాలు పడుతోంది. అప్లై చేస్తున్న అభ్యర్ధులకు అసలు నైపుణ్యాలే లేకపోవడంతో అన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. మరోపక్క టీసీఎస్‌తో పాటు చాలా మటుకు ఐటీ కంపెనీలు ఫ్రెషర్లను ఇంటర్వ్యూలు చేసి వారిని ఆఫర్ లెటర్లు ఇచ్చి జాయినింగ్ తేదీలను మాత్రం వెల్లడించడం లేదట. దాంతో దాదాపు పది వేల మంది ఫ్రెషర్లు కంపెనీ నుంచి ఎప్పుడు జాయినింగ్ తేదీలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ సంస్థ అయితే గత ఏడాది దాదాపు 50 వేల మంది ఫ్రెషర్లను ఎంపికచేయగా ఈ ఏడాది కేవలం 11 వేల మందికే పరిమితమైంది. ఇక విప్రో సంగతి చెప్పనక్కర్లేదు. దాదాపు రెండేళ్ల నుంచి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకుండా ఆలస్యం చేస్తోంది. జెన్సార్ సంస్థ ఆల్రెడీ ఎంపికచేసిన వారిని మళ్లీ టెస్ట్‌లు రాయాలని అంటోంది. ఈ సంస్థలకు ఎక్కువగా నార్త్ అమెరికా, యూరప్ నుంచి ఫండ్స్ రావాల్సి ఉంటుంది. ఆ దేశాల్లో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడి ఉద్యోగులపై ప్రభావం పడుతోంది. భారత్ ప్రభుత్వం దాదాపు రూ.6000 కోట్లతో ఐటీ కంపెనీల్లో క్వాంటమ్ టెక్నాలజీని ఏర్పాటయ్యేలా చూస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu