Ad Code

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్ ప్రారంభం !


దేశీయ మార్కెట్లో ఈనెల 24న వన్‌ప్లస్‌ నార్డ్‌ CE4 లైట్‌ 5G ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ మిడ్‌రేంజ్‌ ధర సెగ్మెంట్‌లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌, వన్‌ప్లస్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. ICICI బ్యాంకు, వన్‌కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు కూడా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2100 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. మరియు 2MP డెప్త్‌ సెన్సార్‌ సహా సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో 16MP కెమెరాను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 695 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ Adreno 619 GPU, 8GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. 80W వైర్ Supervooc, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను మెగా బ్లూ, సూపర్ సిల్వర్‌, అల్ట్రా ఆరెంజ్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్‌ రంగుల హ్యాండ్‌సెట్‌లు ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. Wi-Fi 5, బ్లూటూత్‌ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. దీంతోపాటు 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu