Ad Code

లెమన్ గ్రాస్ టీ -ఆరోగ్య ప్రయోజనాలు !


కొన్ని రకాల టీలను తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో లెమన్ గ్రాస్ టీ ఒకటి. ఈ టీని రోజు తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మగడ్డితో తయారు చేసిన ఈ టీని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా గడ్డిని వాడి అనేక వ్యాధులకు చెక్ పెడుతున్నారు. లెమన్ గ్రాస్ టీ తాగితే పొట్టలో అల్సర్లు తగ్గిపోతాయి. బీపీ తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. జీవక్రియలు నియంత్రించబడతాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా దూరం అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu