Ad Code

ఆంధ్రప్రదేశ్ లో నడిచే పలు రైళ్లకు నెంబర్లు మార్పు !


ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల నెంబర్లను మార్చారు. జులై ఒకటో తేదీ నుంచి ఈ నెంబర్ల మార్పు వర్తిస్తుంది. వీటిల్లో ప్రధానంగా విశాఖపట్నం నుంచి కడప మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు ఉంది. ప్రస్తుతం ఈ రైలు నెంబరు 18521 కాగా తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖపట్నంకు నడిచే రైలు నెంబరు 18522గా మార్చారు. పాత నెంబర్లు 17488, 17487గా ఉండేవి. విశాఖపట్నం నుంచి బనారస్ మధ్య నడుస్తున్న బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 18523 కాగా, తిరుగు ప్రయాణంలో బనారస్ నుంచి విశాఖపట్నం బై వీక్లీ ఎక్స్ ప్రెస్ నెంబరు18524గా మార్చారు. ఈ రైలు పాత నెంబర్లు 18311, 18312 గా ఉన్నాయి. విశాఖపట్నం టు కిరండూల్ నైట్ ఎక్స్ ప్రెస్ నెంబర్ 18527, తిరుగు ప్రయాణంలో 18528గా మార్చారు. వీటి పాత నెంబర్లు 18514, 18513 గా ఉండేవి. కటక్ టు గుణపూర్ ప్యాసింజర్ నెంబర్ 68433 కాగా, గుణపూర్ టు కటక్ ప్యాసింజర్ రైలు నెంబర్ 68434 గా మార్చారు. వీటి పాత నెంబర్లు 08421, 08422 గా ఉండేవి. విశాఖపట్నం టూ రాయపూర్ ప్యాసింజర్ రైలు నంబర్ 58528, తిరుగు ప్రయాణంలో 58527గా మార్చారు. వీటి పాత నెంబర్లు 08528, 08527 గా ఉండేవి. విశాఖపట్నం టూ గుణుపూర్ ప్యాసింజర్ రైలు నెంబర్ 58506, తిరుగు ప్రయాణంలో 58505గా మార్చారు. వీటి పాత నెంబర్లు 08522, 08521గా ఉండేవి. విశాఖపట్నం టూ భవానీ పట్నం ప్యాసింజర్ రైలు నెంబరు 58504, తిరుగు ప్రయాణంలో భవానీపట్నం టు విశాఖపట్నం నెంబర్ 58503గా మార్చారు. వీటి పాత నెంబర్లు 08504, 08503గా ఉండేవి. మారిన రైలు నెంబర్లన్నీ రైల్వే టైంటేబుల్ లో అందుబాటులో ఉంటాయని, అవి సెప్టెంబరు, అక్టోబరు నెలలో అన్ని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని రైళ్ల నెంబర్లు అందులో ఉంటాయని, వాటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu