Ad Code

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం !


హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సాయంత్రం నుంచి మేఘావృతమై, కొద్దిసేపటి నుంచి పలు చోట్ల వర్షం కురుస్తొంది. నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. ఐఎండీ ప్రకటించిన కొన్ని గంటలకే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, జోన్‌లో సాయంత్రం నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. ఇక దమ్మాయిగూడ, కాప్రా, ఏఎస్ రావ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోందని స్థానికులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu