Ad Code

శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ విడుదల !


శామ్‌సంగ్ ఇటీవల కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌ను గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ పేరుతో బడ్జెట్-స్నేహపూర్వక స్మార్ట్‌వాచ్‌ విడుదల చేసింది. ఇది గెలాక్సీ వాచ్ సిరీస్‌లోని వివిధ ఫీచర్లతో బడ్జెట్ ధరలో రిలీజ్ చేశారు. ఈ వాచ్ 1.2 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ డబ్ల్యూ 920 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ+16 జీబీ నిల్వ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 247 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్‌సంగ్ వాచ్ ఎఫ్ఈ బ్లాక్, పింక్ గోల్డ్, సిల్వర్ అనే మూడు రంగుల్లో 40 ఎంఎం సైజు ఎంపికలో అందుబాటులో ఉంటుంది. ఇది  దేశంలో సుమారు రూ. 16,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంటున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ ఎల్‌టీఈ వెర్షన్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించబడుతోంది. ఈ వాచ్ కూడా సుమారు రూ. 20,000గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ ఎఫ్ 2021 గెలాక్సీ వాచ్ 4 ఫీచర్లతోనే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 1.2 అంగుళాల సూపర్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, ఎక్సినోస్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 247 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ వేర్ ఓఎస్ 4 ఆధారంగా వన్ యూఐ వాచ్ 5 ద్వారా పని చేస్తుంది. ముఖ్యంగా ఎన్ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూత్ 5.0 వంటి అధునాతన కనెక్టీవిటీ ఎంపికలతో టెక్ ప్రియులను ఈ వాచ్ ఆకట్టుకుంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ 100కి పైగా విభిన్న వర్కవుట్‌లను ట్రాక్ చేస్తుంది. ముఖ్యంగా నిద్రను పర్యవేక్షించడంతో పాటు రక్తపోటు పర్యవేక్షణ, పర్సనల్ హార్ట్ జోన్‌ల వంటి లక్షణాల ద్వారా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. సమగ్ర ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం సామ్‌సంగ్‌కు సంబంధించిన బయోయాక్టివ్ సెన్సార్‌ల సూట్, అలాగే శరీర కూర్పు విశ్లేషణ, పర్సనల్ ఫిట్‌నెస్ కోచింగ్‌ను కూడా అందిస్తుంది. వినియోగదారులు గెలాక్సీ వాచ్ ఎఫ్ఈ ద్వారా తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాను రిమోట్‌గా నియంత్రించవచ్చు. అలాగే చెల్లింపులు, డిజిటల్ ఐడీల కోసం సామ్‌సంగ్ వ్యాలెట్‌ను ఉపయోగించవచ్చు. అలాగే వాచ్‌లోని ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌ని ఉపయోగించి వారి ఫోన్‌ను సులభంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ వాచ్‌పై గీతలపడకుండా ఉండేలా ప్రత్యేక క్రిస్టల్ ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu