Ad Code

వెంకయ్యనాయుడు జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి : ప్రధాని మోడీ !


హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన  'సేవలో వెంకయ్య నాయుడు జీవితం', '13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం', 'మహానేత వెంకయ్య నాయుడు జీవితం, ప్రయాణం' అనే మూడు పుస్తకాలను వర్చువల్‌గా ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. ''వెంకయ్య నాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కింది. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారు. అత్యయిక పరిస్థితి వేళ ఆయన పోరాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్య నాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛభారత్‌, అమృత్‌ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు'' అని మోడీ  కొనియాడారు. 

Post a Comment

0 Comments

Close Menu