Ad Code

సెప్టెంబర్‌లో విడుదలకానున్న అమెజాన్ "మేటిస్" ?


పెన్‌ఏఐ చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ 'మేటిస్'  పేరుతో ఏఐ లాంచ్ చేయనుంది. అమెజాన్ విడుదల చేయనున్న కొత్త మేటిస్ ఏఐ ఇప్పటికే అందుబాటులో ఉన్న టైటాన్ ఏఐ మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుందని సమాచారం. మేటిస్ ఏఐ అనేది టెక్స్ట్, ఇమేజ్ బేస్డ్ సమాధానాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఏఐ రేసులో అమెజాన్ కొంత వెనుకబడి ఉంది. అయితే అనుకున్న విధంగా సంస్థ (అమెజాన్) కొత్త మేటిస్ ఏఐ లాంచ్ చేసిన తరువాత ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అగ్రగాములుగా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన చేరుతుందని పలువురు భావిస్తున్నారు. అమెజాన్ తన 'మేటిస్ ఏఐ'ను 2024 సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ లాంచ్‍కు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించ లేదు. అయితే కంపెనీ అలెక్సా ఈవెంట్‌లో అమెజాన్ మేటిస్ లాంచ్ చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu