Ad Code

ఐఆర్సీటీసీ పాస్‌వర్డ్‌ మర్చిపోయారా ?

ఆర్సీటీసీలో  కొన్ని సందర్భాల్లో యూజర్‌ నేమ్‌, పాస్‌ వర్డ్‌ను మర్చిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు పాస్‌వర్డ్‌ కాలపరిమితి ముగిసిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ  ఆన్‌లైన్ ద్వారా పాస్‌వర్డ్‌ను మళ్లీ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్‌ చేయబడిన ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌ అవసరం అవుతాయి. ముందుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అనంతరం లాగిన్‌ సెక్షన్ వద్ద Forgot Password పైన క్లిక్‌ చేయాలి. అనంతరం అక్కడ యూజర్‌ నేమ్ నమోదు చేయాలి. అనంతరం Next పైన క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు, జవాబులను అకౌంట్ క్రియేట్‌ చేసే సమయంలో నమోదు చేసి ఉంటారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన తర్వాత.. ఐఆర్సీటీసీ వెబ్‌ సైట్‌ తో రిజిస్టర్‌ అయిన మెయిల్‌ కు కొన్ని సూచనలు వస్తాయి. ఆ లింక్‌పైన క్లి్క్‌ చేసి పాస్‌వర్డ్‌ ను మళ్లీ క్రియేట్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ నంబర్‌ ద్వారా కూడా ఐఆర్సీటీసీ పాస్‌వర్డ్‌ ను క్రియేట్ చేసుకోవచ్చు. అనంతరం మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని నమోదు చేయాలి. ఆ తర్వాత కొత్త పాస్‌వర్డ్‌ ను నమోదు చేయాలి. అక్కడ కనిపించిన Captcha ను నమోదు చేసి submit చెయ్యాలి. కొద్ది క్షణాల్లోనే మీ కొత్త పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ కావచ్చు. అయితే పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసిన సమయంలో బలమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్షరాలు, అంకెలు, స్పెషల్‌ క్యారెక్టర్‌లతో బలమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. యూజర్‌ల ఈ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌ల ద్వారా పాస్‌వర్డ్‌ను మార్చేందుకు వీలుకాకుంటే ఐఆర్సీటీసీ కస్టమర్ కేర్ సిబ్బందితో మాట్లాడి, సమస్య పరిష్కరించుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu