Ad Code

భారీగా తగ్గినబంగారం, వెండి ధరలు


గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్క సారిగా తగ్గాయి. ఈ రోజు గరిష్టంగా రూ. 2080 తగ్గి పసిడి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.65700 (22 క్యారెట్స్), రూ.71760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 1900, రూ. 2080 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో కూడా బంగారం ధరలు అమాంతం తగ్గిపోయాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66500 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72550 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ రేట్లు వరుసగా రూ. 1900, రూ. 2070 వరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది. బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా భారీగా తగ్గింది. ఈ రోజు  కేజీ వెండి ధర రూ. 91500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 4500 తక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడ్డాయని స్పష్టమవుతోంది.

Post a Comment

0 Comments

Close Menu