Ad Code

చికెన్ లివర్ - ఆరోగ్య ప్రయోజనాలు !


చికెన్ లివర్‌ను కొంతమంది ఇష్టంగా తింటుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాల మంచిది. ఎందుకంటే, చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ లివర్‌తో కంటి, చర్మ, రక్త హీనత సమస్యలను దూరం చేస్తుంది. చికెన్‌ లివర్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం ద్వారా రక్త కణాలను పెంచుతుంది. రక్త హీనత తగ్గించడానికి సహాయపడుతుంది. చికెన్‌ లివర్ లో విటమిన్ కే  అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మ్యుఖ్యం. మీ డైట్‌లో చికెన్‌ లివర్ తీసుకుంటే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. విటమిన్ బి 12 ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి, నిరాశ, అయోమయం, చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి ఇంది మంచి ఆహారం. చికెన్ లివర్ డయాబెటిస్ పేషెంట్లకు కూడా మంచిది. దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుకు మంచిది. అంతేకాదు ఇందులో ఉండే సెలీనియం గుండె జబ్టులపై పోరాడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా కంట్రోల్‌ చేస్తుంది. లివర్ లో ఉండే ఫోలేట్ లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా కండరాలు, ఎముకలను బలంగా చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu