Ad Code

ఒడిశాకు కొత్త సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ?


నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మాఝీని బీజేపీ అధిష్టానం ఒడిశా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్‌ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్‌ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి. కేవీ సింగ్ డియో బోలంగీర్‌ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.


Post a Comment

0 Comments

Close Menu