Ad Code

చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటోలు..... వీడియో వైరల్ !


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎలా వచ్చిందో, ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఓ చిరుత పులి రోడ్డు పక్కనే గడ్డిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది. అటుగా వెళ్లిన స్థానికులు దాన్ని చూసి షాక్ అయ్యారు. పులికి గాయపడిందేమో, ఏమీ చేయలేదులే అనుకుని సమీపానికి వెళ్లి చూస్తారు. ఇలా కొద్ది సేపట్లోనే అక్కడ చాలా మంది గుమికూడతారు. చాలా మంది పులిని దూరం నుంచే చూస్తుంటారు. కొందరు దూరం నుంచి ఫొటోలు తీసుకుంటుంటారు. అయినా చిరుత పులి కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి మరో అడుగు ముందుకేసి దగ్గరగా వెళ్లి వీడియో తీసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటికీ పులి ఏమీ అనకుండా కామ్‌గా ఉంటుంది. దీంతో అతడు రెచ్చిపోయి మరింత దగ్గరగా వెళ్లి పులిని వీడియో తీస్తూ ఇబ్బంది పెడతాడు. ఒక్కసారిగా పైకి లేచి వారి పైకి దూకుతుంది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగందుకుంటారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''పులితో ఆటలు ఆడితే ఇలాగే ఉంటుంది మరి''.. అంటూ కొందరు, ''పులిని తక్కువ అంచనా వేశారు పాపం''.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu