Ad Code

కేరళలో మావటిని రెండు కాళ్లతో తొక్కి చంపిన ఏనుగు !


కేరళలోని అడిమాలికి సమీపంలోని కల్లార్‌ ప్రాంతంలో జూన్ 20న టూరిస్టులను సఫారీకి తీసుకెళ్లేందుకు ఈ ప్రాంతంలో చాలా ఏనుగులను ఉంచుతుంటారు. ఈ క్రమంలో బాలకృష్ణన్ (60) అనే మావటి ఓ ఏనుగు వద్దకు వెళ్లి కర్రతో ట్రైనింగ్ ఇస్తున్నాడు. తన చేతిలోని కర్రతో ఏనుగు కాళ్లపై సున్నితంగా కొడుతూ ఏనుగు సరిగ్గా నిలబడేలా ఆర్డర్ వేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఏనుగుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే మావటిపై దాడి చేసి కాళ్ల కింద అతడిని ఒత్తిపడేసింది. తన రెండు కాళ్లను బలంగా మోపి బలంగా తొక్కింది. అంతటితో ఆగకుండా అతడి వీపుపై కూడా కాళ్లు మోపి తొక్కడంతో మావటి అక్కడికక్కడే చనిపోయాడు. ఏనుగు దాడి చేయడాన్ని గమనించిన మరో మావటి పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అయితే అప్పటికే బాలకృష్ణన్ మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు మాత్రం సీరియస్ గా స్పందించారు. ఏనుగులను అక్రమంగా సఫారీకిలకు తీసుకెళ్తున్నట్లు బైటపడింది. ఈ జిల్లాలో చాలా ఏనుగు సఫారీ కేంద్రాలకు అనుమతి లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu