Ad Code

వోల్ఖోవ్ నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థుల దుర్మరణం


ష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. ఈ మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని దేశంలోని భారతీయ మిషన్లు శుక్రవారం వెల్లడించాయి. మరణించిన నలుగురిలో 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలిపింది. వీరు వెలికి నొవ్‌గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నారు. వోల్ఖోవ్ నది ఒడ్డున నిలబడిన ఉన్న ఓ భారతీయ విద్యార్థిని నీటిలో మునిగింది. ఆమెను రక్షించేందుకు నలుగురు సహచరులు ప్రయత్నించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ విద్యార్థినితోపాటు మరో ముగ్గురు కూడా నదిలో మునిగిపోయారు. ఓ బాలుడిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. "సరైన వైద్యం అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఇండియన్ మిషన్ “ఎక్స్‌”లో తెలిపింది. వీలైనంత త్వరగా మృత దేహాలను బంధువులకు పంపడానికి వెలికి నొవ్‌గోరోడ్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాన్సులేట్ జనరల్ తెలిపారు. మృతుల కుటుంబాలను సంప్రదించి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తాము రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులర్ జనరల్‌ను సంప్రదించామని జలగావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థినికి అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నారని వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu