Ad Code

ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు !


నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని, భారీ వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.  ఈ నెల 4, 5 తేదీల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని మొదట వాతావరణ శాఖ అంచనా వేయగా, రెండు రోజులు ముందే నైరుతి ఏపీ తీరాన్ని తాకింది. 

Post a Comment

0 Comments

Close Menu