Ad Code

త్వరలో లావా బ్లేజ్ X స్మార్ట్ ఫోన్ విడుదల ?


లావా బ్లేజ్ X స్మార్ట్ ఫోన్ ను 'Coming Soon' ట్యాగ్ తో త్వరలో లాంచ్ చేయనున్నట్లు లావా ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క రెండర్ తో లావా టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం సేల్ పార్ట్ నర్ గా అమెజాన్ ఇండియాను ఎంచుకుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన టీజర్ పేజిని అందించింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ప్రవేశపెట్టే అవకాశం ఉండవచ్చు. అయితే, ఈ ఫోన్ రెండర్ల ద్వారా ట్రెండీ ఫీచర్ లతో వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ రెండర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ కెమెరా డిజైన్ తో కనిపిస్తోంది. లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో కర్వ్ డ్ డిస్ ప్లే ఉన్నట్లు కూడా ఈ టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. లావా ఇప్పటికే తన బడ్జెట్ సిరీస్ అయిన బ్లేజ్ సిరీస్ నుంచి మంచి బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లను అందించింది. అందుకే, ఈ సిరీస్ నుంచి రాబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ ఫీచర్లను కూడా త్వరలోనే అందించే అవకాశం ఉండవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu