Ad Code

ఐక్యూ నుంచి Z9 లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్ ?


ఐక్యూ Z సిరీస్‌లో ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌ లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐక్యూ Z9 5G, ఐక్యూ Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ వివరాలు ఆధారంగా జులై నెలలో ఐక్యూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్ లాంచ్‌ కానుంది. X (ట్విట్టర్‌) పోస్టు ద్వారా కీలక వివరాలను వెల్లడించారు.  మరో టిప్‌ స్టర్‌ సంజు చౌదరి వివరాల ఆధారంగా జులై నెల మధ్యలో ఈ ఐక్యూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలి పారు. దీంతోపాటు ఈ హ్యాండ్‌ సెట్ ఇప్పటికే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌  సర్టిఫికేషన్‌ ను పొందింది. ఈ ఐక్యూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఎంట్రీ లెవల్‌ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ గా విడుదల కానుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌ సెట్‌ బ్రౌన్‌, బ్లూ రంగుల్లో లభిస్తుంది. కొన్ని లీక్‌ల ఆధారంగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ వివో T3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని తెలుస్తోంది. కొన్ని లీక్‌ల ఆధారంగా ఐకూ Z9 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ రూ.12 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu