Ad Code

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్01 బైక్ ?


దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 మోడల్ మోటార్‌ సైకిళ్లలో ఒకటి. కాలానుగుణంగా ఈ మోటార్‌సైకిల్ డిజైన్ లో కొన్ని మార్పులు చేసినప్పటికీ, ఇప్పటి వరకు బైక్ మోడల్ దాదాపు అలాగే ఉంది. లగ్జరీ టూవీలర్ బ్రాండ్ గా అత్యధిక అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే మారుతున్న కాలం, కస్టమర్స్ టేస్ట్ ఆధారంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ రంగంలోకి రాబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారట!. ఈ బైక్‌కి రాయల్ ఎన్‌ఫీల్డ్ 'ఎలక్ట్రిక్01' అని పేరు పెట్టవచ్చని చెబుతున్నారు. 2026 ప్రారంభంలో ఈ బైక్ మార్కెట్లోకి లాంచ్ కావొచ్చని అంచనా. 350-700 cc సెగ్మెంట్‌లో ఈ బైక్ లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా బ్యాటరీ ప్యాక్ అమర్చి బ్యాటరీ బైక్స్ యుగంలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు మార్కెట్ వర్గాల భోగట్టా. రోలింగ్ కెపాసిటీ, స్పీడ్ పెంచేలా సన్నీ టైర్లతో ఈ బైక్ డిజైన్ చేస్తున్నారట. బ్యాక్ వీల్ బెల్ట్ డ్రైవ్ ద్వారా నడిచే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. కుర్రకారుకు బెస్ట్ ఆప్షన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. 100 సంవత్సరాల క్రితం బైకులో ఉపయోగించిన గిర్డర్ ఫోర్క్‌ను ఉపయోగించి అత్యంత పటిష్టమైన బాడీతో ఈ బైక్ రెడీ చేస్తున్నారట. బ్రాండ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్ మార్కెట్ లోకి వస్తుందని, దీంతో EV రంగంలో మరో అధ్యాయం షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆటోమొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu