Ad Code

హాథ్‌రస్‌లో సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట : 100 మందికి పైగా మృతి


త్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్‌లో సత్సంగ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు చనిపోయారు. ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఆగ్రా జోన్ ఏడీజీ కార్యాలయం మృతుల సంఖ్యను ధ్రువీకరించింది. అంతకుముందు ఈ ఘటనలో 60 మంది మృతి చెందారని, 18 మంది గాయాలు పాలైనట్లు హాథ్‌రస్‌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నిపుణ్ అగర్వాల్ బీబీసీ ప్రతినిధి దిల్ నవాజ్‌ పాషాకు తెలిపారు. 50 నుంచి 60 మంది వరకు మరణించారని హాథ్‌రస్‌ జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఈ సంఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ''ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హాథ్‌రస్‌ జిల్లాలోని సికంద్రారావు దగ్గర్లో ఉన్న ముఘల్‌గఢీ గ్రామంలో భోలే బాబాకు చెందిన ఒక కార్యక్రమం జరిగింది. తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారు. ఎటా ఆస్పత్రికి 27 మృతదేహాలు వచ్చాయి. వాటిలో 23 మహిళలకు చెందినవి కాగా, మూడు చిన్నారులవి. ఒకటి మగ వ్యక్తిది. గాయాలు పాలైన వారిని ఇంకా ఆస్పత్రికి తీసుకు రాలేదు.'' అని ఎస్ఎస్‌పీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu